Rashmi Birthday Celebrations With Anasuya

2018-04-28 3,321


dIS:Anchor Rashmi Rashmi Birthday Celebrations. Rashmi Gautam is an Indian film actress, who appears mostly in Telugu films. She also starred in the 2011 Tamil romantic film Kandaen, winning positive reviews for her performance. She works also as a television presenter and is known for hosting the Telugu television comedy show Extra Jabardasth.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రష్మి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో యాంకర్ అనసూయ కూడా రష్మిని విష్ చేస్తూ ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మిని విష్ చేస్తూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.
2002 లో సవ్వడి అనే సినిమాతో రష్మి సినిమా కెరీర్ ప్రారంభమైంది. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో షాలు పాత్రలో సపోర్టింగ్ రోల్ చేసింది.
2007లో వనిత టీవీలో ‘యువ' అనే కార్యక్రమం రష్మి చేశారు. 2010లో తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం' చిత్రంలో రష్మి సహాయనటిగా చేసింది. ఆ తరువాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత ‘కందెన్' సినిమా అనే తమిళ సినిమాలో అవకాశం ఇప్పించింది. 2011లో వచ్చిన కందెన్ రష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి.