Bahubali 2 Director Rajamouli Get apploses From China People

2018-04-27 1,415

"So happy to meet all the fans and film enthusiasts who made it to the #Baahubali2 screaming screening in Tokyo, Japan last night. The love for movies surpasses boundaries... Happy day.. :)" Rajamouli tweeted.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-2' చిత్రం జపాన్‌లో కూడా సంచలన విజయం సాధించింది. డిసెంబర్ 29, 2017లో జపనీస్ బాషలో ఈ చిత్రాన్ని విడుదల చేయగా విజయవంతంగా అక్కడ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జపనీస్ బాహుబలి-2 డిస్ట్రిబ్యూటర్లు భారీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరయ్యారు. దీనికి జపాన్ ఫ్యాన్స్ భారీగా తరలి రావడం, వారి నుండి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి రాజమౌళి ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు.
‘బాహుబలి 2' ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణమైన అభిమానుల్ని, సినీ ఔత్సాహికులను నిన్న రాత్రి జపాన్ రాజధాని టోక్యోలో కలవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ప్రేమ హద్దులను చెరిపేసింది. హ్యాపీ డే'' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
టోక్యోలో జరిగిన 100 రోజుల వేడుకలో పలువురు జపాన్ అభిమానులు దర్శకుడు రాజమౌళి, శోభు యార్లగడ్డకు ధన్యవాదములు తెలుపుతూ తెలుగులో ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం.
#Baahubali2
#tollywood
#Tokyo