'Avengers: Infinity War' Potentially Heading To $500 Million Worldwide Opening

2018-04-26 228

Superb response for Avengers Infinity War pre bookings. Avengers Infinity War ready for release on 27 Apri

ఓ హాలీవుడ్ చిత్రం ఇండియాలో విడుదలవుతుందంటే చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. కానీ తొలిసారి ఓ హాలీవుడ్ యాక్షన్ చిత్రం గురించి ప్రతి చోటా చర్చ జరుగుతోంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతీయ స్థానిక చిత్రాలకు ధీటుగా ఈ చిత్రానికి టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మార్వల్ సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని అతిపెద్ద విలన్ తానొస్ నుంచి రక్షించడమే ఈ చిత్ర కథ. అద్భుత విన్యాసాలు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో అవెంజర్స్ చిత్రం భారతీయ సినీ ప్రియులని అలరించడానికి సిద్ధంగా ఉంది.
అవెంజర్స్ చిత్రానికి ఇప్పటికే అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఈ చిత్ర ప్రీమియర్ షోలు ఏప్రిల్ 23 న ప్రదర్శించబడ్డాయి. అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. సినీ విశ్లేషకుల చెబుతున్నా మాట ప్రకారం అవెంజర్స్ చిత్రం కమర్షియల్ చిత్రాలకు బాబులాంటి సినిమా అని అంటున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ప్రపంచ వ్యాప్తంగా 1600 వందల కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కు వస్తున్న రెస్పాన్స్ బట్టి అవెంజర్స్ చిత్రం అన్ని హాలీవుడ్ చిత్రాల రికార్డులని ఇండియాలో కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం ఇండియాలోనే ఈ చిత్రం తొలిసారి 200 కోట్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలవబోతుందని అంచనా వేస్తున్నారు.
ఆన్ లైన్ లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దక్కుతున్న ఆదరణ చూసి ప్రముఖ సంస్థ బుక్ మై షో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విడుదలవుతోంది హాలీవుడ్ చిత్రమా లేక ఇండియా స్టార్ హీరో చిత్రమా అనే అనుమానం కలగక మనదని ఆ సంస్థ ఓ ప్రకటనలోతెలిపింది.
#Avengers: Infinity War
#Hollywood