IPL 2018: RCB VS CSK match Highlights

2018-04-26 7

Mahendra Singh Dhoni sported a contemporary, even funky high-and-tight hairstyle that came in full view when he removed his helmet at the end of the match. But his mind remained in its old space - cold and calculative. His precise, unbeaten 70 was the guiding force behind Chennai Super Kings' five-wicket win over Royal Challengers Bangalore at the M Chinnaswamy stadium here on Wednesday (April 26). For the latecomers, Chennai Super Kings made 207 for five in 19.4 overs chasing Royal Challengers 205 for eight in 20 overs.

ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
చెన్నై ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (70 నాటౌట్‌; 34 బంతుల్లో ఒక ఫోర్, 7సిక్సులు) బాదగా, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో చెలరేగాడు. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైని వీరిద్దరూ ఆదుకున్నారు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రాయడు ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉమేశ్‌ యాదవ్‌ జారవిడిచాడు.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్‌ 15 ఓవర్ల వరకు బెంగళూరు వైపే ఉన్నప్పటికీ, చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 18 ఓవర్‌లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను ఉమేశ్‌ యాదవే రనౌట్‌ చేశాడు.
దీంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి బ్రేవో (14) సాయంతో ధోని (70) గెలుపుని సిక్సుతో లాంఛనంగా పూర్తి చేశాడు. బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి తలో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.