Madhavi Latha Responds on Fans Tweets

2018-04-24 1,855

Actor Madhavi Latha has been responding on Tollywood controversies. She has posted some interesting post on Facebook. She revealed some interesting fact about Pawan, Srireddy others. She feels that, Jayasudha must be in Tollywoods cash committee.
#Pawankalyan
#Madhavilatha
#Sreereddy
టాలీవుడ్‌లో ఇటీవల చోటుచేసుకొన్న వివాదాలపై నటి మాధవీలత ఘాటుగానే స్పందిస్తున్నారు. శ్రీరెడ్డి, మహేష్ కత్తి లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు దాడి చేస్తున్నారు. అంతేకాకుండా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ఎవరైనా నోరెత్తితే సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇంతకీ మాధవీలత ఏమన్నారంటే..
ఎప్పుడో పదో తరగతిలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్‌ను లవ్ చేశా. ఆ రోజు పార్టీ లేదు. రాజకీయం తెలీదు. ఇవాళ ఎవరో వ్చి ఏదో చేస్తారని నా ప్రేమ పోదు. ఐ లవ్ పవన్ కల్యాణ్ ఫరెవర్. అది ఆయనకు చెప్పే అవసరం కూడా నాకు లేదు. నా ప్రేమ నా ఇష్టం. పార్టీకి నాకు సంబంధం లేదు అని మాధవీలత ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశారు.
నేను పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్యనా? అని ఎంది సామీ మీ గోల?. ఆయన్ని నాకంటే ఎక్కువ మంది లవ్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి మాట అని పవన్ కల్యాణ్‌ను అవమానించవద్దు. ఇదే పనా ఆయనకు. నాకు నా ఫ్రెండ్స్ అంటే ఇష్టం. ఆయన అంటే నాకు ప్రేమ అన్నంత మాత్రాన మీరు అనుకొనే కంపు కాదు. ఎలాంటి స్వార్ధం లేని ప్రేమ నాది.
అలాగే వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై పరోక్షంగా మాధవీలత సెటైర్లు వేశారు. కొందరు నీ ముఖానికి పాలిటిక్స్ ఎందుకు? నీకు అంత సీన్ లేదు. ఎవరైనా ఒక బకరాను పెళ్లి చేసుకో. పవన్‌ను అడ్డం పెట్టుకొని పైకి రావాలని ప్లాన్ ఉందా?. పవన్‌కు భజన చేస్తే పార్టీలోకి పిలువరు అని మాధవీలత సెటైర్లు విసిరింది. అందేకాకుండా నాకు టీవీ చూసే అలవాటు లేదు. ఫేస్‌బుక్ చూస్తే ఇలాంటి కామెంట్లు నవ్వుకోవడానికి చాలా చాలా బాగుంటున్నాయి అని మరో ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశారు.