నాని, నాగార్జున సినిమా లో రాస్మిక హీరోయిన్

2018-04-24 51

Nagarjuna and Nani, then the filmpromises to be a riot. This highly anticipated venture has finally gotten underway, latest news that a hit heroine confrimed opposite nani
#Nani
#RashmikaMandanna
నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ హీరోయిన్ గతంలో సుమంత్ నటించిన మళ్ళిరావా సినిమాలో హీరోయిన్ గా నటించింది. రెండోసారి అక్కినేని హీరోతో నటించడం విశేషం. తాజా సమాచారం మేరకు నాని సరసన రస్మిక మడన్నా హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం. చలో సినిమాతో మంచి విజయం సాధించిన ఈ హీరోయిన్ నాని పక్కన నటించే అవకాశం లభించడం విశేషం. త్వరలో ఈ హీరోయిన్ పేరు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాబోతున్నాడు. గతంలో నాగార్జున చాలా సినిమాలకు మణిశర్మ సంగీతం అందించడం జరిగింది. నాగార్జున, నాని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఉంటుందన్నారు దర్శకుడు ఆదిత్య శ్రీరామ్. కామిడి ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకేక్కబోతోంది.

Videos similaires