Sara Ali Khan dances to Saat Samundar Paar at wedding reception. Video goes viral in internet.
#saifalikhan
#saraalikhan
సినీ స్టార్ల వారసులు ఆ రంగంలోకి అడుగు పెట్టకముందే పెద్ద సెలెబ్రిటీలు గా మారిపోతుంటారు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ వారసులు ఇలా వార్తల్లో నిలుస్తున్నా సంగతి తెలిసిందే. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం కూడా ఇంత వరకు విడుదల కాలేదు. కానీ జాన్వీ ఎంత పెద్ద సెలెబ్రిటీనో అందరికి తెలిసిందే. ఇకమరో సెలెబ్రిటీ వారసురాలు, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీఖాన్ సోషల్ మీడియాని ఓ రేంజ్ లో దున్నేస్తోంది. ఇటీవల ఓ పార్టీలో సారా మెరిసింది. అక్కడ ఆమె స్టెప్పులతో చేసిన రచ్చ సోషల్ మీడియాని కుదిపేస్తోంది.
సైఫ్ అలీఖాన్, అమృతసింగ్ ముద్దల తనయి సారా అలీఖాన్. బాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే ఈ అమ్మడు హాట్ సెలేబ్రిటిగా మారిపోయింది.ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కు యువత ఫిదా అయిపోతున్నారు.వివిధ వేడుకల్లో మెరుస్తూ ఈ భామ బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడుతోంది.
ఇటీవల సారా ఓ వివాహ వేడుక కు హాజరైంది. ఆ వేడుకలో సారా చీరకట్టులో అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సారా 'సాథ్ సముందర్ పార్' అనే సాంగ్ కు అదిరిపై స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం సారా డాన్స్ వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. లయబద్దంగా ఆమె వేసిన స్టెప్పులు యువతని చూపు తిప్పుకోనీయడం లేదు.