Manchu Manoj open letter on filmindustry issue. He extends His support to Pawan Kalyan
#ManchuManoj
#Pawankalyan
#Filmindustry
మంచు వారబ్బాయి హీరో మనోజ్ అందరితో ఎంత కలివిడిగా, సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. అదే సమయంలో మనోజ్ కు సామజిక స్పృహ కూడా ఉంది.మనోజ్ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటాడు. తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రగులుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదం గురించి మజోజ్ తనదైన శైలిలో స్పందించాడు. సినిమా తల్లి బిడ్డని అంటూ బహిరంగ లేఖ విడుదల చేసి తానూ చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. జరుగుతున్న వివాదంపై మనోజ్ కు ఉన్న అవగాహన, విశ్లేషణ పరిజ్ఞానం ఈ లేక ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మనోజ్ లేఖలో పేర్కొన విషయాలు ఇప్పుడు చూద్దాం..
కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలు అని రంగాల్లో ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు, మీడియా, బ్యాంకింగ్ ఇలా అన్ని రంగాల్లో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. ఇంతకంటే ఘోరమైన పాపాలు కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. కానీ కేవలం కాస్టింగ్ కౌచ్ విషయంలో మాత్రమే ఇండస్ట్రీని తప్పుడు పడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. ఇలాంటి సమస్యల్ని నిర్ములించడానికి అందరం కలసి పనిచేద్దాం.
పవన్ కళ్యాణ్ అన్న ఓ ట్వీట్ చేసారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళల హక్కుల గురించి పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆయనకు నేను తోడుగా ఉంటా. కానీ నాపోరాటం కేవలం ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు మాత్రమే పరిమితం కాదు.