Allu Arjun Aggressive Speech about Pawan Kalyan at Naa Peru Surya Na Illu India movie Audio Launch.Mega Producer Naga Babu Emotional Speech at Naa Peru Surya Na Illu India Audio release event
#Allu Arjun
#Naa Peru Surya
#Anuemmanuel
ఈ ఫంక్షన్ మాత్రమే కాదు, ప్రతి ఫంక్షన్‌కు ఉత్సాహంగా వచ్చే మెగా అభిమానులందరికీ మనస్తూర్తిగా ధన్యవాదాలు. మెగాస్టార్ గారి అభిమానులు, పవర్ స్టార్ గారి అభిమానులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు, ప్రత్యేకంగా నన్ను ఇష్టపడే స్టైలిష్ స్టార్ అభిమానులు.... ఎన్ని పేర్లు చెప్పిన అందరం మెగా కుటుంబం. అది మాత్రం మరిచిపోవద్దు. మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి, వారిని ఎలాగైనా ఆరాధించండి... ఎండ్ ఆఫ్ ది డే అందరం ఒకటే. టైమ్ వచ్చినపుడు అది మీకే అర్థం అవుతుంది... అని అల్లు అర్జున్ తెలిపారు.
నేను ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే నాకు అనిపించాలి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు అది అనిపించింది కాబట్టే ఇపుడు మాట్లాడుతున్నాను. నాగబాబు గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు నెం. 1హీరో.... ఎన్నో కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఎంతో సుఖవంతమైన జీవితం అనుభవించవచ్చు. అలాంటివన్నీ వద్దనుకని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని వచ్చారు. కొంత మంది సినిమాల్లో కెరీర్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లోకి వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. నెం.1 పొజిషన్లో ఉన్నపుడు వదిలేసుకుని వచ్చారు.... అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.