భరత్ అనే నేను మూవీ కలెక్షన్స్

2018-04-23 13

Mahesh Babu's Bharat Ane Nenu has made super collection at the worldwide box-office in the first weekend. The film surpassed Rs 120 crore gross mark in three days.

మహేష్ బాబు తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో నటించిన చిత్రం 'భరత్ అనే నేను'. సీఎం భరత్ పాత్రలో మహేష్ బాబు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాడు. తెరపై సీఎంగా తన పనితీరుతో భరత్ భేష్ అనిపించుకుంటుంటే.... ఇక్కడ బాక్సాఫీసు వద్ద రెస్పాన్స్‌ అదిరిపోతోంది. దీంతో నిర్మాత ఖజానాకు వసూళ్లు వరదలా వచ్చి పడుతున్నాయి. తొలి 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ.120 కోట్లకు పైగా వసూలు చేసిందంటే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫస్ట్ వీకెండ్ (3 రోజులు)లోనే రూ. 120 కోట్లు(గ్రాస్)కుపైగా వసూలు చేయడం ద్వారా మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా భరత్ అనే నేను రికార్డుల కెక్కింది. అంతే కాకుండా నాన్ బాహుబలి కేటగిరీలో ఫస్ట్ వీకెండ్ భారీ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నెం.1 స్థానం సొంతం చేసుకుంది.
కనీవినీ ఎరుగని రీతిలో ‘భరత్ అనే నేను' చిత్రం తొలి 2 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు ముందు రంగస్థలం మూడున్నర రోజుల్లోనే ఈ ఫీట్ అందుకోగా, తాజాగా ‘భరత్ అనే నేను' చిత్రం దాన్ని బీట్ చేసింది.

Videos similaires