Koratala Shiva Exclusive Vedio about Bharath Ane Nenu

2018-04-23 1

భరత్ అనే నేను చిత్రం విడుదలై అంతటా విజయ దుందుభి మోగిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన భరత్ అనే నేను చిత్రం అంచనాలని అందుకుని ప్రేక్షకులని మెప్పిస్తోంది. ముఖ్యంగా మహేష్ నటన, కొరటాల దర్శకత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. రాజకీయ పరమైన కథ కావడంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల కనెక్ట్ అవుతోంది. రాజకీయ నేపథ్యం ఉన్న కథ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి కూడా అనువదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల ఈ చిత్రంలో లేవనెత్తిన రాజకీయ సమస్యలు దాదాపుగా అని రాష్ట్రాల్లో ఉన్నాయి. దీనితో భరత్ అనే నేను చిత్రం అన్ని భాషల అభిమానులని ఆకట్టుకునే అవకాశం ఉంది. త్వరలోనే భరత్ అనే నేను చిత్రాన్ని పలు భాషల్లోకి అనువదించబోతున్నట్లు కొరటాల తెలిపారు.