సాహో గురించి షాకింగ్ న్యూస్,ఇది మాటలు కాదు!

2018-04-21 69

Saaho is an upcoming Indian film written and directed by Sujeeth and produced by UV Creations. Recently the movie schedule started in Dubai.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన స్టిల్స్ ఏవీ లీక్ కాకుండా 'సాహో' టీమ్ జాగ్రత్తపడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈరోజు నుండి చిత్ర యూనిట్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు దుబాయ్ లో చిత్రికరించబోతున్నారు. 20 నిమిషాల సన్నివేశం కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. నిజంగా ఇది షాకింగ్ న్యూస్. చిన్న ఎపిసోడ్ కు ఇంత ఖర్చు అంటే మాటలు కాదు. బాహుబలి సినిమాకు ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్ పూర్తి తరువాత హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు యూనిట్.
ఈ మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేయనున్నాడు అనే దానిపై కూడా జోరుగా చర్చ నడుస్తుంది. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు ప్రభాస్. ఈ సినిమా ముందు మొదలుకానుందా ? వేరే దర్శకుడితో సినిమా ఉంటుందా చూడాలి.

Videos similaires