పవన్ కల్యాణ్ పై రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్న వేమూరి రాధాకృష్ణ

2018-04-21 17

Actor turned Jana Sena party chief Pawan Kalyan has criticized ABN Andhra Jyothi media on the issue pertaining to Sri Reddy-RGV's controversies.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పరువు నష్టం దావా వేయబోతున్నారు. తనపై కుట్ర పన్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఆయన న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసుతో పాటు రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు సమాచారం.
ఫిల్మ్ ఛాంబర్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు మీడియా వాహనాలపై దాడి చేయడాన్ని జర్నలిస్టులు ఖండిస్తున్నారు. ఈ దాడిలో ఆంధ్రజ్యోతి ఓబీ వ్యాను ధ్వంసం కాగా పలు వాహనాలపై బండరాళ్లతో దాడి చేసినట్టు సమాచారం. ట్వీట్స్ ద్వారా పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలే ఈ దాడికి కారణమయ్యాయని అంటున్నారు.
శ్రీరెడ్డి తన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేశారని పవన్ చేసిన ఆరోపణలను ఏబీఎన్ ఖండించింది. తమ ఛానెల్ జర్నలిజం విలువలను పాటించిందని, ఆ బూతు పదాన్ని మ్యూట్ చేశాకే ప్రసారం చేశామని వివరణ ఇచ్చింది. అంతేకాదు, శ్రీరెడ్డి వేలు చూపిస్తూ విమర్శించిన తీరును కూడా బ్లర్ చేసినట్టు తెలిపింది. ఇవేవి తెలుసుకోకుండానే పవన్ కల్యాణ్ తమపై ఆరోపణలు చేశారని ఆ ఛానెల్ పేర్కొంది.