Raj Tarun father Basava Raju jailed for three years in cheating case. Basava Raju got loan on road gold ornaments. In this case M78agistrate Sunny Parvin Sultana Begam given judgement.
టాలీవుడ్ యువహీరో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బసవరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్‌లో అసిస్టెంట్ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు.
పోలీసుల కథనం ప్రకారం.. 2013లో తన భార్య రాజ్యలక్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్.ఎన్.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.9.85 లక్షల రుణం తీసుకొన్నారు. బ్యాంక్ అధికారుల తనిఖీల్లో తాకట్టు పెట్టిన బంగారం నకిలీ అని తేలింది.
దాంతో బసవరాజుపై బ్యాంకు మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం.. బసవరాజుపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు బసవరాజును విచారించింది.
పలు విచారణల అనంతరం ఈ కేసుపై మేజిస్ట్రేట్ సన్నీపర్విన్ సుల్తానాబేగం తాజాగా తీర్పును వెల్లడించారు. రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు.
ప్రస్తుతం రాజ్ తరుణ్ తెలుగు సినిమా పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తన కెరీర్‌లో మంచి విజయాలు సొంతం చేసుకొంటున్నారు. తాజా ఘటనపై వ్యాఖ్యానించడానికి సినీ వర్గాలు నిరాకరించాయి.