Celebrities Tweets On Bharat Ane nenu

2018-04-20 1,133

SS Rajamouli, Sreenu Vaitla and many other celebs from the Telugu film industry have lauded director Koratala Siva and Mahesh Babu for their work in Bharat Ane Nenu

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇటు అభిమానుల నుండి, అటు సినీ క్రిటిక్స్ నుండి ఈ చిత్రానికి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈచిత్రం మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ లాంటి ఇష్యూలను చూపించాలంటే ఎంతో ఆలోచన అవసరం. ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేసిన దర్శకుడు కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబును అభినందించాల్సిందే. సినిమాలో ఎన్నో గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. అందులో ప్రెస్ మీట్ సీన్ మరింత అద్భుతంగా ఉంది అని అని రాజమౌళి తెలిపారు.
మహేష్ బాబు కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్. సినిమాకు ఎంచుకున్న తారాగణం కూడా చాలా బావుంది. ప్రతి ఒక్కరూ ఆయా పాత్రలకు పర్ఫెక్టుగా సరిపోయారు. చిత్ర నిర్మాత దానయ్య గారికి, భరత్ అనే నేను బృందానికి కంగ్రాట్స్.... అని రాజమౌళి ట్వీట్ చేశారు.
మహేష్ బాబు తన మైండ్ బ్లెయింగ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఇంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నందుకు టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ దర్శకుడు శ్రీను వైట్ల ట్వీట్ చేశారు.
మహేష్ బాబు తన పాత్రలో జీవించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ స్టన్నింగ్ అనేలా ఉంది. దర్శకుడు కొరటాల శివ ఎంతో నిజాయితీగా స్టోరీ నేరేట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తనదైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరుతో అదరగొట్టారు అని. టీమ్ మొత్తానికి అభినందనలు అని దర్శకుడు వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు.
భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు కెరీర్లో మరొక మెమొరబుల్ బ్లాక్ బస్టర్. అద్భుతమైన స్క్రిప్టుకు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, టాప్ డైరెక్షన్ స్కిల్స్ మ్యాచ్ అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ వస్తుంది అని బివిఎస్ రవి తెలిపారు.