Bharat Ane Nenu cinema review: Maheshbabu's another Magic.Bharat Ane Nenu world wide grand release today.Bharath Ane Nenu Public Talk
దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రిన్స్ మహేష్‌బాబు ఒకరు. ఆయన నటించిన చిత్రాలు దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రిన్స్ నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రిన్స్ కెరీర్‌లో తప్పనిసరిగా హిట్టు కావాల్సిన తరుణంలో ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందుకోసం శ్రీమంతుడు అందించిన దర్శకుడు కొరటాల శివతో జతకట్టాడు. ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గత చిత్రాల కంటే మిన్నగా మ్యాజిక్ సాధించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఎప్పటిలానే కొరటాల శివ సామాజిక అంశాలతో కథను అల్లుకొన్నాడు. కథ, కథనాలను పక్కగా రూపకల్పన చేసుకొన్నప్పటికీ.. అక్కడక్కడ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. సోషల్ ఇష్యూస్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జొప్పించడంలో కొరటాల శివ తన మార్కు చూపించాడు. భావోద్వేగ సన్నివేశాలను చక్కగా రాసుకొన్నాడు. హీరోయిన్ వసుమతితో రొమాంటిక్ సీఎం భరత్ రొమాంటిక్ సన్నివేశాల విషయంలో హద్దు దాటలేదు. మహేష్ పాత్ర డిజైన్ కొరటాల పరిణతికి అద్దం పట్టింది. ప్రకాశ్ రాజ్ క్యారెక్టరైజేషన్‌పై ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొన్నట్టు కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అంశాలను చక్కగా పేర్చుకోవడంలో కొరటాల సఫలమయ్యాడు.