RGV Strong Counter To Allu Aravind Comments Over Sri Reddy Issue

2018-04-20 942

RGV Strong Counter to Allu Aravind comments over Sri Reddy Issue.

శ్రీరెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్‌ను తిట్టించిన ఇష్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అరవింద్ చేసిన కామెంట్లపై పవన్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. గౌరవనీయులైన అల్లు అరవింద్ గారి కామెంట్స్ కి నా సమాధానం అంటూ ఆయన అన్న ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో వర్మ కౌంటర్ ఇచ్చారు.
అరవింద్ గారి కామెంట్: ఒక మనిషికి కొన్ని రోల్స్ ఉంటాయి.. ఇండస్ర్టీలో సీనియర్ గా నాకు గౌరవం ఉంది.
RGV: ఎవరు కాదన్నారు? ఎవరు లేదన్నారు?
అరవింద్ గారి కామెంట్: శ్రీ రెడ్డి వ్యవహారం పై చాలా సార్లు ఛాంబర్ లో చర్చించాం. రెండు మీటింగ్స్ లో పాల్గొన్నా
RGV: అది బహిరంగంగా చర్చించాల్సిన విషయం..పవన్ విషయానికి ఇంత ఫాస్టుగా వచ్చారు కానీ ఆ విషయంలో ఇండస్ట్రీకి అంత పెద్ద సీనియర్ గా నెల రోజులుగా ఒక చిన్న కామెంట్ కూడా చెయ్యలేదు మీరు.
అరవింద్ గారి కామెంట్: అంతర్గతంగా ప్రభుత్వం నిబంధనలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి..సినీ పరిశ్రమలో మహిళ పై లైగికంగా వేధిస్తే కమిటీ ద్వారా విచారణ చర్యలు తీసుకుంటామ్
RGV: అదేకదా నేను 20 రోజుల నుంచీ నేత్తి నోరు బాదుకుంటూ అరుస్తున్నది.
అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీ తీసుకుంటున్న కమిటీ లో నేను మెంబర్ గా ఉంటున్న
RGV:గ్రేట్..
అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీ కి RGV చాలా ద్రోహం చేస్తున్నాడు
RGV: పవన్ కళ్యాణ్ లాంటి లక్షలమంది ఫాన్స్ వున్న తనని అలాంటి మాట అనిపించి నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను కాని ఇండస్ట్రీకి ఎలా ద్రోహం చేస్తున్నాను?
అరవింద్ గారి కామెంట్: నిన్న RGV కి చెందిన వీడియో చూశాను.శ్రీ రెడ్డి పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వెనక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడన్నది స్పష్టం అయ్యింది.
RGV: వీడియోలో ఆ తప్పు చేసింది నేనేనని చెప్పింది నేనే కదా ..ఇంకా అందులో స్పష్టమవడానికి ఏముంది?