Allu Aravind Fires On Ram Gopal Varma

2018-04-19 3,753

Popular director Ram Gopal Varma says sorrry to Pawan Kalyan in Sri Reddy Contravercy. He said I was influenced the Sri reddy to scold Pawan Kalyan. In this context, Varma tweeted that My sincere apologies once again to PawanKalyan and all his fans and also his family members

ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు అయింది. నా తండ్రి అల్లు రామలింగయ్య, చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇలా మేమంతా ఎన్నో ఎళ్లుగా పరిశ్రమతో అనుబంధం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు తల్లిలాంటింది. అలాంటి పరిశ్రమలో చోటుచేసుకొన్న విషయాలు చాలా బాధకలిగించాయి అని అల్లు అరవింద్ అన్నారు.
ఇటీవల జరుగుతున్న సంఘటనలు చాలా బాధకు గురిచేసింది. శ్రీరెడ్డి బయటపెట్టిన విషయాలపై పరిశ్రమ స్పందించింది. ఆమె లేవనెత్తిన విషయాలకు సినీ వర్గాలు పరిష్కారాలను సూచిస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబతున్నారనే విషయాలను వెల్లడిస్తారు.
సినీ పరిశ్రమలో నా పాత్ర గురించి నేను ప్రస్తుతం క్లారిటీ ఇచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. సినీ పరిశ్రమలో వేధింపులకు చెక్ పెట్టడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో ఎన్జీవో నుంచి సభ్యులకు చోటు కల్పిస్తారు.
సినిమా పరిశ్రమలో ఎవరైనా నిర్మాత సినీతారలపై వేధింపులకు పాల్పడితే అతడి నుంచి తొలగిస్తాం. దర్శకులు, అసిస్టెంట్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకొంటాం.
రాంగోపాల్ వర్మ‌ను నేను టార్గెట్ చేస్తున్నాను. ఇండస్ట్రీలో శివ లాంటి గొప్ప సినిమాను తీశాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ముంబైలో ఉంటున్నాడు. అతడు తల్లిగా భావించాల్సిన ఆ వ్యక్తి ఎలాంటి ద్రోహం చేస్తున్నాడో చెప్పడానికి మీముందుకు వచ్చాను. అలాంటి వ్యక్తి ఎంత నికృష్ణుడో చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను.
రాంగోపాల్ వర్మ గారు అనే గౌరవం ఇవ్వదలచుకోలేదు. అందుకే నిన్ను మిస్టర్ రాంగోపాల్ వర్మ అని అంటాను. పవన్‌పై నీచమైన పదజాలాన్ని ఉపయోగించి శ్రీరెడ్డికి చెప్పాననే వీడియోను రాత్రి చూశాను. అయితే అప్పుడు కూడా వర్మ అలాంటి వాడు కాదని అనుకొన్నాను. మరో వీడియో చేస్తే గానీ రాంగోపాల్ వర్మ వెధవ తెలివితేటలు తెలిసిరాలేదు.