Indian film directed by Koratala Siva, featuring Mahesh Babu and Kiara Advani in the lead roles. It is set to release on 20 April 2018. the latest news we know that benifet shows of this film will be cancelled
మహేష్ బాబు, కొరటాల శివల కలయికలో రూపొందిన రెండవ చిత్రం 'భరత్ అనే నేను'. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పూర్తి పాటలు విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమపై భారి అంచనాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు బెనిఫిట్ షోలు ఉండవని తెలుస్తోంది. గతంలో చాలా సినిమాలు విడుదల రోజు ముందు రాత్రి నుండి షోలు వెయ్యడం జరిగింది, కాని భరత్ అనే నేను సినిమాకు షోలు పడే అవకాశాలు లేవని ఇండస్ట్రి లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయం గురించి స్పష్టమైన వార్తా రావాల్సి ఉంది.
తమ అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షోస్ ఉండవని తెలిసి అభిమానులు ఆలోచనలో పడ్డారు. పెద్ద హీరోల సినిమాలకు ఒకసారి పర్మిషన్స్ లభిస్తే మరోసారి అనుమతి లభించదు. భరత్ అనే నేను సినిమా కు అనుమతి లభించలేదా ? నిర్మాత వద్దు అనుకున్నాడా తెలియాల్సి ఉంది. త్వరలో ఈ విషయంపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కైరాఅద్వాని మొదటిసారి మహేష్ బాబుతో నటిస్తోంది. భరత్ అనే నేను సినిమాలో అసెంబ్లీ సీన్, ధియేటర్ ఫైట్ అభిమానుల్ని అలరించబోతున్నాయని సమాచారం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతుందని నిర్మాత ఇటీవల ఇంటర్వ్యూ లో తెలిపాడు.