Virat Kohli gets angry on umpire after getting Hardik Pandya not out . In MI vs RCB match of IPl 2018 Virat gets angry after seeing 3rd umpire Decision. Let me tell you that the first Hardik Pandya was given out by the umpire, after this Rohit Sharma take DRS. IN 3rd umipre decision Hardik Pandya is not out.
సొంతగడ్డపై వాంఖడె స్టేడియంలో మంగళవారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ మ్యాచ్‌లో మైదానంలోని అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్ విధానం ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
థర్డ్ అంఫైర్ నిర్ణయంపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకింత అసహనానికి గురయ్యాడు.
ముంబై ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో క్రిస్ ఓక్స్ వేసిన రెండో బంతి హార్దిక్ పాండ్యా బ్యాట్‌ను దాటి కీపర్ డీకాక్ చేతిలోకి వెళ్లిపోయింది. బౌలర్ అప్పీల్ చేయడంతో అంపైర్ నితిన్ మీనన్ దానిని ఔట్‌గా ప్రకటించాడు. అయితే పాండ్యా ఔట్‌పై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ కోరాడు.
రివ్యూలో హార్దిక్ బ్యాట్‌ను బంతి తగిలినట్లుగా చూపించింది. అంటే స్నిక్కో మీటర్‌లో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చాయి. కోహ్లీతోపాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులు సైతం పాండ్యా ఔటే అని అనుకున్నారు. కానీ టీవీ అంపైర్ మాత్రం అనూహ్యంగా పాండ్యాని నాటౌట్‌గా ప్రకటించారు.
దీంతో షాక్‌కు గురైన విరాట్ కోహ్లీ పాండ్యాను నాటౌట్‌గా ప్రకటించడంపై మైదానంలోని అంపైర్‌ను ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత పాండ్యా చెలరేగిపోయాడు. అదే ఓవర్‌లో రెండు వరుస సిక్సులు బాదాడు. దీంతో కోహ్లీ అసహనం మరింత ఎక్కువైపోయింది. అంపైర్ వద్దకు వెళ్లి మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.