Ipl match that was held on saturday was won by mumbai indians.Royal challengers lost its match.There are few reasons why royal challengrs lost in the last match.
ఐపీఎల్ 11వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై జట్టు మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
బెంగళూరు మ్యాచ్ లో రోహిత్ శర్మ జూలు విదిల్చాడు. అసలైన టీ20 పోరు ఎలా ఉంటుందో అభిమానులకు రుచి చూపించాడు. 52 బంతుల్లో 10 పోర్లు, 5 సిక్సులతో 94 పరుగులు నమోదు చేశాడు.
ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లపై ఎంతో నమ్మకముంచింది. అయితే ఇప్పటివరకు ఈ సీజన్‌లో వీరిద్దరూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించలేదు. వాషింగ్టన్ సుందర్‌పై విరాట్ కోహ్లీ నమ్మకముంచి పవర్ ప్లేలో అతడికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరచుకోలేకపోయాడు. వీరిద్దరూ కలిసి వేసిన 5 ఓవర్లకు గాను 64 పరుగులు సమర్పించుకున్నారు.
చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు 70 పరుగులు సమర్పించుకున్నారు.
214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకి చక్కటి శుభారంభం దక్కాలి. దీంతో ఓపెనర్ డీకాక్-విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడటంతో తొలి నాలుగు ఓవర్లకు గాను బెంగళూరు 40 పరుగులు చేసింది. ఈ సమయంలో బెంగళూరు బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్ మిచెల్ మెక్లెన్‌గన్‌ను రంగంలోకి దించాడు. మెక్లెన్‌గన్ వేసిన ఓవర్‌లో నాలుగో బంతికి బెంగళూరు బిగ్ ఫిష్ ఏబీ డివిలియర్స్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. డివిలియర్స్ ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.