Ram Charan And Boyapati Movie Title Fixed

2018-04-18 953

Interesting news on RamCharan and Boyapati film title. Rajavamsasthudu is in consideration

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్ర అఖండ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ రికార్డులని కొల్లగొట్టింది. చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ అదరగొట్టేసింది సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకుపైగా షేర్ తో రన్ అవుతోంది.
రాంచరణ్ నటించబోతున్న బోయపాటి చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్గా రాబోతోంది. సాధారణంగా బోయపాటి చిత్రాలు మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా అదే తరహాలో మాస్ ఎలిమెంట్స్ తో రూపొందుతోంది.
రంగస్థలం చిత్రం కోసం రాంచరణ్ చిట్టిబాబు పాత్రలో రఫ్ లుక్‌లో కనిపించాడు. పల్లెటూరి యువకుడిగా, వినికిడి లోపంతో తన స్టార్‌డమ్ సైతం పక్కన పెట్టి నటించాడు. కానీ బోయపాటి చిత్రంలో ఫాన్స్ కి నచ్చేలా చెర్రీ స్టైలిష్ లుక్ లోకి వచ్చేయనున్నాడు. చరణ్ సరికొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రాంచరణ్ హాజరు కాకుండానే దర్శకుడు బోయపాటి రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఈ నెల చివరి నాటికి చరణ్ షూట్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సినిమాపై ఆసక్తి పెంచడంలో టైటిల్ పాత్ర కూడా ఉంటుంది. రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ నటించే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా బోయపాటి దర్శకత్వం కావడంతో వారి అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలు రెట్టింపు చేసేలా ఈ చిత్ర టైటిల్ గురించి వార్తలు వస్తున్నాయి. 'రాజవంశస్థుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రాంచరణ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ నేపథ్యలో ఈ చిత్రం సాగుతుందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రోమాలు నిక్కబొడుతునేలా యాక్షన్ సన్నివేశాలని బోయపాటి చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.