Pawan Kalyan & Ravi Prakash Had Their Misunderstandings

2018-04-17 1,267

Why media targeting Pawan Kalyan. Here is the reason

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత ఆయనపై మీడియా ఫోకస్ ఎక్కువైంది. గత నాలుగేళ్లుగా పవన్ కళ్యాణ్ అటు సినిమాల పరంగా, రాజకీయ పరంగా మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతూ వచ్చారు. తెలుగులో ప్రధాన మీడియా సంస్థలైన ప్రముఖ ఛానల్స్ పవన్ కళ్యాణ్ కు బాగా ప్రచారం కల్పించాయి.కానీ ఈ మధ్య కాలంలో టివి9 లో పవన్ కళ్యాణ్ వ్యతిరేకశక్తుల ప్రభావం ఎక్కువవుతోంది.ఆడియో వేదికపై పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కుపించారు.
కాటమరాయుడు ఆడియో వేడుకకు టీవీ9 అధినేత రవిప్రకాష్, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ వేడుకలో రవిప్రకాష్ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కు మద్దత్తు ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌పై రవిప్రకాష్ ప్రశంసలు కురిపించారు.
ఇద్దరు ప్రధాన మీడియా అధినేతలు పవన్ కళ్యాణ్ కు అండగా ఉండడంతో జనసేనాని మంచి ప్రచారం లభిస్తుందని అంతా భావించారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్, రవిప్రకాష్ మధ్య ఏదో జరిగిందని సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పవన్, రవిప్రకాష్ మధ్య విభేదాలు తలెత్తాయని జనాల్లో ఓ ఊహాగానం వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది. అజ్ఞాతవాసి ఆడియో వేడుక ప్రసార హక్కుల విషయంలో పవన్, రవిప్రకాష్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ఓ చర్చ జరుగుతోంది.అజ్ఞాతవాసి ఆడియో వేడుక టివి5లో ప్రసారం అయిన సంగతి తెలిసిందే.