IPL 2018 : The Secret Behind Andre Russell Shots

2018-04-17 45

Andre russell was in full form in this IPL season.He Scored 41 runs in 12 balls in which six balls are sixers. His tremendous batting leads to growth of Team Score.

ఐపీఎల్ 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ ఆండ్రీ రసెల్ భీకర హిట్టింగ్‌తో.. ప్రత్యర్థి బౌలర్లు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాడు. సోమవారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రసెల్ కేవలం 12 బంతుల్లో ఆరు సిక్సర్లు బాది (41) స్కోరు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు 200 భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
రస్సెల్ ముఖ్యంగా ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని లక్ష్యంగా చేసుకుని పరుగుల వర్షం కురిపించాడు. ఈ హిట్టర్ అతను వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 40 పరుగులు పిండుకున్నాడు. ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి తరలించాలనే కసితో ఈ హిట్టర్ కనిపిస్తుండటంతో.. అతనికి బౌలింగ్ వేసేందుకే ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు.
టోర్నీ ఆరంభంలోనే ఈ హిట్టర ఫామ్‌లోకి రావడంతో.. కోల్‌కతా జట్టు సంబరపడుతుండగా.. ప్రత్యర్థి జట్ల బౌలర్లలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఈ హిట్టర్ బాధిత జాబితాల్లో మహ్మద్ షమీ, డ్రేన్ బ్రావో (చెన్నై) చేరారు.
వారం క్రితం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రసెల్ 36 బంతుల్లో (88) పరుగులు చేశాడు. అంతేకాదు అతను చేసిన హాఫ్ సెంచరీ కూడా వేగవంతంగా నమోదైంది. దీంతో.. ఆ మ్యాచ్‌లోనూ కోల్‌కతా 202 పరుగులు చేసింది. గాయం కారణంగా.. గత ఏడాది ఐపీఎల్ ఆడలేకపోయిన రసెల్‌ను ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ రూ.8.5 కోట్లకి అట్టిపెట్టుకునే విధానం ద్వారా దక్కించుకుంది.