Dvv Danaiah My Dream Fulfilled Making Bharat Ane Nenu (Video)

2018-04-17 1

Bharat Ane Nenu movie set to release on April 20th. Prince Mahesh Babu and Kiara Advani are lead pair for this movie. Srimanthudu Fame Koratala Siva director for the movie. DVV Danaiah is producing this movie on DVV banner. In this occassion, DVV Danaiah speaks to Filmibeat Telugu exclusively.

టాలీవుడ్‌లోని భారీ బడ్జెట్ చిత్రాలను అందించే నిర్మాతల్లో డీవీవీ దానయ్య ఒకరు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి అగ్రహీరోలతో చిత్రాలను రూపొందించిన దానయ్య.. ప్రస్తుతం మహేష్‌బాబుతో భరత్ అనే నేను సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఇప్పటికే విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. తన 25 ఏళ్ల సినీ జీవితంలో ఎదురైన అనుభవాలను ఆయన పంచుకొన్నారు.
నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమై 25 ఏళ్లు పూర్తి చేసుకొన్నాం. 1992లో దర్శకులు, దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకిడి పంబ సినిమా తీశాను. ఇన్నేళ్లలో ఎన్నో విజయవంతమైన సినిమాలు, మరికొన్ని యావరేజ్ సినిమాలు తీశాను. ప్రస్తుతం డీవీవీ బ్యానర్‌లో మహేష్‌బాబుతో భరత్ అనే నేను సినిమా తీశాను. ఏప్రిల్ 20 తేదీన రిలీజ్ అవుతుంది.