Allu Arjun Next Film With Top Director Fans Happy With This New

2018-04-17 456

allu arjun recent film naa peru surya ready to release. his next film with a top director, we have to wait for its official announcement. now allu arjun busy in naa peru surya movie promotions.

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా తరువాత చెయ్యబోయే సినిమాకు సంభందించి క్లారిటి లేదు. నా పేరు సూర్య మొదలుపెట్టినప్పటి నుండి బన్నీ మరొక సినిమా చేసేద్దాం అని అనుకుంటున్నా సరైన కథ దొరక్కపోవడం సినిమా మొదలు కావడం లేదు.
ఆ మధ్య లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని బన్ని ప్రటించాడు. ఆ సినిమాను చెన్నైలో ప్రారంభం చేసారు కాని ఇప్పుడు ఆ సినిమా గురించి మాటే లేదు. తాజాగా బన్ని సినిమాకు సంభందించిన ఒక న్యూస్ బయటికి వచ్చింది. భరత్ అనే నేను దర్శకుడు కొరటాల శివతో అల్లు అర్జున్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
గతంలో కొరటాల శివ సినిమా ఒకసారి చరణ్ తో మొదలయ్యి ఆగిపోయింది. కొన్ని నెలల క్రితం చరణ్, కొరటాల సినిమా ఉండబోతోందని అధికారికంగా ప్రకటించారు. సడన్ గా బన్ని సినిమా కోరటాలతో ఉంటుందని అంటున్నారు. ఏవిషయమైన ఆఫిషియల్ న్యూస్ వచ్చే వరుకు నమ్మలేము. అల్లు అర్జున్ తన ఫోకస్ అంత నా పేరు సూర్య పై పెట్టినట్లు తెలుస్తోంది.
కొరటాల శివ తీసిన సినిమాలు ఎక్కడా ఫ్లాప్ కాలేదు. అలంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో సినిమా చేయ్యబోతున్నాడని తెలిసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమా, కొరటాలతో ఉంటుందని పోస్ట్స్ పెట్టుకొని సంబర పడిపోతున్నారు. త్వరలో ఈ వార్తా నిజం కావాలని మనం కోరుకుందాం.