Barath Ane Nenu Director Clarifies About Gossips

2018-04-17 474

Koratala Siva gives clarity on Bharat Ane Nenu story. Bharat Ane Nenu releasing on April 20

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న భరత్ అనే నేను చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. మహేష్ ధాటికి టాలీవడ్ రికార్డులు గల్లంతు కావడం ఖాయం అని అంచనాలు వేస్తున్నారు.
భరత్ అనే నేను చిత్రం సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై సినీవర్గాలు, అభిమానులు పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. పక్కా బ్లాక్ బాస్టర్ అని మహేష్ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆయన చేసిన మూడు చిత్రాలు మిర్చి, శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ చిత్రాలు తిరుగులేని విజయాలు సాధించాయి. మహేష్, కొరటాల సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్నా చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకే విధంగా ఉన్నాయి.
మహేష్ బాబు నటిస్తున్న తొలి రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం ఇదే. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో దర్శకుడు కొరటాల శివ సమాజంలో ఉన్న ప్రధాన సమస్యలని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
భరత్ అనే నేను చిత్ర కథ వెనుక ఓ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర కథని కొరటాల శివ పెద్ద మొత్తం చెల్లించి తకిట తకిట దర్శకుడు శ్రీహరి నుంచి తీసుకున్నారని వార్తలు వచ్చాయి.