Pawan kalyan Get Supported By Madavi Latha

2018-04-16 2,154

MadhaviLatha sensational FB post on PawanKalyan. Truth will reveal soon Madhavi Latha said

కాస్టింగ్ కౌచ్ విషయంలో నటి శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. మాధవీలత కూడా ఈ విషయంలో తరచుగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హస్తం ఉన్న బడా సెలెబ్రిటీల పేర్లనే శ్రీరెడ్డి బట్టబయలు చేసింది. మాధవీలత కూడా తనకు ఎదురైన అనుభవాలని వెల్లడించింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి పోరాటం గురించి స్పందించారు.అన్యాయం జరిగి ఉంటె నేరుగా వెళ్లి పోలీస్ కేసునమోదు చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ స్పందపై శ్రీరెడ్డి మరియు ఇతర జూనియర్ ఆర్టిస్టులు మండిపడిన సంగతి తెలిసిందే.
తాజాగా మాధవీలత పేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ ఉండడం విశేషం.
పవన్ కళ్యాణ్ కు నిజం తెలుసు అని మాధవీలత అన్నారు. అందుకే ఆయన ఇన్నిరోజులు స్పందించకుండా ఉన్నారని అన్నారు. ఇటీవల కూడా తప్పని పరిస్థితుల్లో ఆయన స్పందించారని మాధవీలత అన్నారు.
త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని మాధవీలత అన్నారు. తాను ఎందుకు పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తున్నానో తెలుస్తుందని మాధవీలత తెలిపింది.
ఇదే పోస్ట్ లో మాధవీలత అభిమానులని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేసింది. ఏంటి ఫాన్స్..మీకే చెబుతున్నా పవన్ కళ్యాణ్ మీరు అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు అని మాధవి అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజం, పవన్ కళ్యాణ్ కు తెలిసిన నిప్పులాంటి జనం త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. ఆ నిజాల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.