Actress Madhavi Latha Responded On Film Industry

2018-04-14 3

When Sri Reddy issue become hot in Industry. Actress Madhavi Latha responded on Film industry. She reveals about her experiences in the Tollywood. Madhavi Latha faults Tollywood heroes.


టాలీవుడ్‌ను ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వెంటాడుతున్నది. శ్రీరెడ్డి ఉదంతం సినీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శ్రీరెడ్డి ఘటనపై మాధవీలత స్పందిస్తూ.. తాను కూడా అనేక అవమానాలకు గురయ్యానని చెప్పారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తోపాటు, సోషల్ మీడియాలో మాధవీలత తన అనుభవాలను పంచుకొన్నారు. మాధవీలత మాట్లాడిన విషయాలు మీకోసం..
ఓ హీరోయిన్‌కు డైరెక్టర్ ఎలాంటి గౌరవం ఇస్తే కింది వాళ్లు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇస్తారు. ఏ హీరోయిన్‌కైనా అన్యాయం జరిగిందని తెలిస్తే బాలీవుడ్‌లో ప్రతీ హీరో బయటకు వచ్చి స్పందిస్తారు. కానీ మన హీరోలు ఎందుకు మాట్లాడరు అని మాధవీ లత ప్రశ్నించింది.
అమ్మాయిలా గురించి, వాళ్ల సేఫ్టీ గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడటం విడ్డూరం అని మాధవీ లత వెల్లడించింది. కొందరి దర్శకుల తీరు చాలా దారుణంగా ఉంటుంది అని ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో మాట్లాడుతూ మాధవీలత ఆవేదన వ్యక్తం చేసింది.
అతిథి సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను మాధవీ లత వివరించింది. ఈ చిత్రంలో నటించే హీరో అంటే చాలా గౌరవం ఉంది. ఆయన డీసెంట్. ప్రవర్తించే తీరు చాలా బాగుంటుంది. కానీ ఓ రోజు హీరోతో కాంబినేషన్‌లో ఈ సీన్ తీస్తున్నారు. హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడం ఆలస్యం అయింది. సెట్లోకి రావడం ఐదు నిమిషాలు లేటయింది. అప్పుడు డైరెక్టర్ ఎందుకు లేటయిందని అడిగితే మండిపడ్డారు.
నిన్ను ఎవరు హెయిర్ డ్రెస్ ఎవడు చేసుకోమని అన్నాడు. నేను సమాధానం చెప్పితే ఓ దశలో దెంగేయ్ అన్నాడు. అయితే దగ్గరలో ఉన్న మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది నాకు బాధ కలిగించింది.
స్నేహితుడు సినిమా షూటింగ్‌లో ఓ వ్యక్తి బూతులు మాట్లాడుతుంటే నాని తీవ్రంగా స్పందించాడు. ఆడపిల్ల పక్కనే ఉన్నది. బూతులు మాట్లాడకూడదు అని నాని మందలించాడు. అప్పుడు నాని ప్రవర్తన నాకు చాలా నచ్చింది.