సిరియాలోని కెమికల్ ప్రొడక్షన్‌ను నాశనం చేసేందుకే ఈ దాడులు: ట్రంప్

2018-04-14 867

The United States, Britain and France launched punitive military strikes against Bashar al-Assad's Syrian regime in response to its latest alleged chemical Activity atrocity, President Donald Trump announced Friday.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. సిరియాలోని డౌమా నగరంపై అక్కడి సైనిక దళాలు జరిపిన రసాయనిక దాడికి ప్రతిచర్యగా.. సిరియాపై వైమానిక దాడిని మొదలుపెట్టారు..
రసాయనిక దాడికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిరియా అల్-అసద్, అసద్ ప్రభుత్వ మద్దతుదేశాలైన రష్యా, ఇరాన్‌లను ట్రంప్ ఇటీవలే హెచ్చరించిన సంగతి తెలిసిందే. బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగానే ఈ దాడులను చేపట్టినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు.
సిరియాపై వైమానిక దాడులు మొదలుపెట్టినట్టు వైట్‌హౌజ్‌లో ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే.. సిరియా రాజధాని డమాస్కస్ లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఏడేళ్ల సిరియా అంతర్యుద్దంలో ఇదో కొత్త అధ్యాయం అని అంటున్నారు. 'కొద్దిసేపటికే క్రితమే, సిరియాపై దాడులు చేయాల్సిందిగా అమెరికా భద్రతా దళాలకు ఆదేశాలిచ్చాను. రసాయనిక ఆయుధాలు ఉన్నాయన్న సిరియా నియంత బషర్ అల్-అసద్ లక్ష్యంగా ఈ దాడులు చేయమని చెప్పాను' అని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు అమెరికన్ టెలివిజన్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. 'ఈ ఆపరేషన్‌ను ఫ్రాన్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లతో కలిసి సంయుక్తంగా చేపడుతున్నాం. ఆ రెండు దేశాలకు ధన్యవాదాలు. రసాయనిక ఆయుధాలు కలిగి ఉన్న ఒక భయంకర పాలనా వ్యవస్థను కూలదోయడానికి జరుగుతున్న ఊచకోత ఇది' అని ట్రంప్ చెప్పడం గమనార్హం. అదే సమయంలో రష్యా, ఇరాన్‌లను కూడా ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సిరియాకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతుగా నిలవరాదని వ్యాఖ్యానించారు. సిరియాలోని కెమికల్ ప్రొడక్షన్‌ను నాశనం చేసేందుకే ఈ దాడులు చేస్తున్నామని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. దాడుల్లో వివిధలక్ష్యాలను బట్టి పలు రకాల బాంబులను ఉపయోగిస్తున్నామని మరో అధికారి తెలిపారు. రష్యా ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఇంకా అదే చీకటి మార్గంలో పయనిస్తారా.. లేక శాంతి కోసం మాతో కలిసి వస్తారా? అని ట్రంప్ ప్రశ్నించారు.

Free Traffic Exchange

Videos similaires