పవన్! మమ్మల్నంటారా? సిగ్గు, లజ్జా ఉందా?: అంబటి రాంబాబు

2018-04-13 419

YSR Congress Party leader Ambati Rambabu lashed out at Andhra pradesh CM Chandrababu Naidu and PM Narendra Modi and Janasena chief Pawan Kalyan for special status issue.

ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరగకపోవడంపై అంబటి తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రధాని అపహాస్య పరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు.
ఇక చంద్రబాబు సింగపూర్ పెట్టుబడుల పర్యటన రామాయాణంలో పిడకల వేటలాటిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన విదేశీ పర్యటనలతో సాధించించదేమీ లేదని అంబటి వ్యాఖ్యానించారు.కేంద్రంతో లాలూచీ కోసమో, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలనో చంద్రబాబు సింగపూర్ వెళ్లి ఉంటారని అన్నారు.
చంద్రబాబు కూడా ఏప్రిల్ 16న చేసే ఏపీ బంద్‌కు మద్దతు తెలపాలని అన్నారు.
సబ్సిడీతో వచ్చే ఫుడ్ తిని టీడీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద విచిత్ర వేషాలు వేశారని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఎంపీలు బుద్ధి తెచ్చుకుని రాజీనామాలు చేయాలని అంబటి అన్నారు. టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో బఫూన్లలా వ్యహరించారంటూ మండిపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి, గల్లా జయదేవ్ లాంటి టీడీపీ ఎంపీలందరూ తమ వ్యాపారాల కోసమే ఎంపీలుగా ఉన్నారని అన్నారు.
సిగ్గు, లజ్జా ఉంటే టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామా చేయాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 16న చేసే బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని ఆరోపించారు. మోడీకి ఉపయోగపడేలా బాబు చర్యలు ఉండవచ్చని అన్నారు.
తమ చిత్తశుద్ధిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం సరికాదని అన్నారు. ఆయనో లీడర్ అవ్వాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. హోదా కోసం తాము పార్లమెంటులో అవిశ్వాసం పెట్టామని, రాజీనామాలు చేశామని, ఆమరణ దీక్షలు చేశామని.. ఇలాంటి తమకు చిత్తశుద్ధి లేదంటే వారికే చిత్తశుద్ధి లేదని తెలుస్తోందని అన్నారు. తమ పోరాటాన్ని శంఖించాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీకి హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. హోదాను బతికుండాలే చేసింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు.

Free Traffic Exchange

Videos similaires