South actors Kamal Haasan, Prakash Raj, Thamanna, Taapsee and some celebs have felt pitty for 8-year-old Asifa in Jammu and Kashmir's Kathua district and demanded justice for her.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన దారుణం సౌత్ సినీ సెలబ్రిటీలు స్పందించారు. ఆసిఫాకు న్యాయం జరుగాలంటూ జరుగుతున్న ఆందోళనలో కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, తాప్సీ, తమన్నా తదితరులు జాయిన్ అయ్యారు. సోషల్ మీడియాలో తమ గళం వినిపించారు.
సంచార బకర్వాల్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ల ఆసిఫా జనవరిలో 10న అపహరణకు గురైంది. వారం తర్వాత ఇంటి సమీపంలో శవమై కనిపించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాలికపై అత్యచారం, హత్య జరిగిందని తేల్చడంతో పాటు 8 మందిపై చార్జ్ షీట్ దాఖలైంది. సంచార జాతి(బకర్వాల్ కమ్యూనిటీ)వారిని తరిమివేసేందుకు కొందరు ఈ దారుణాలకు పాల్పడ్డారని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఛార్జీ షీటులో పేర్కొన్న ఆ నిందుతులు 8మందిలో ప్రధాన నిందితుడు సంజిరామ్(60, రిటైర్డ్ రెవెన్యూ అధికారి)తోపాటు సంజిరామ్ మేనల్లుడైన 15ఏళ్ల బాలుడు, దీపక్ ఖజూరియా(ప్రత్యేక అధికారి), పర్వేశ్ కుమార్(సంజిరామ్ మేనల్లుడి స్నేహితుడు), విశాల్ జంగోత్రా, తిలక్ రాజ్(హెడ్ కానిస్టేబుల్), ఆనంద్ దుత్తా(సబ్ ఇన్‌స్పెక్టర్), సురీందర్ కుమార్(ప్రత్యేక పోలీసు అధికారి) ఉన్నారు.
ఈ ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ... ‘మీ సొంత కూతురికి ఇలా జరిగితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక పురుషుడిగా, తండ్రిగా, పౌరుడిగా ఆసిఫా విషయంలో విఫలం అయ్యాం. నన్ను క్షమించు చిట్టితల్లి... ఈ దేశంలో మీలాంటి చిన్నారులకు భద్రత కల్పించలేక పోయాం. కనీసం భవిష్యత్ తరాల కోసం అయినా నేను పోరాటం చేస్తాను' అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
ఓ వైపు ఉన్నావో కేసు, ఇపుడు ఆసిఫా.... ఒక తండ్రిగా నా హృదయం చాలా బాధ పడుతోంది. ఇంకా ఈ సమాజంలో ఎంత మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. మతరమైన నేరాలను ఇంకా ఎంతకాలం సహించాలి. ఇప్పటికైనా మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి, మేల్కొని ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని ప్రకాస్ రాజ్ ట్వీట్ చేశారు.