విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయండి : చంద్రబాబు

2018-04-13 10

Andhra Pradesh Chief Minister Nara Chandrababu class to Bhuma Akhila Priya and AV Subba Reddy. Chandrababu ready to give another post to Challa Ramakrishna Reddy.

మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన సింగపూర్ బయలుదేరడానికి ముందు కర్నాలు జిల్లాకు చెందిన కొందరు పార్టీ నేతలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా విభేదాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
విభేదాలు వీడి పని చేయాలని ఎన్నిసార్లు సూచించినా వినకపోవడంపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఇప్పటికైనా పార్టీ కోసం అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు విభేదాలు వీడి పని చేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల ఏడాది నేపథ్యంలో మరోసారి చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.ఇచ్చిన హామీ మేరకు ఏవీ సుబ్బారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.
అలాగే, జిల్లాకు చెందిన సీనియర్ పార్టీ నేత చల్లా రామకృష్ణా రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం పైన కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఆయన ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, ఏం కావాలి అనే అంశాలపై అధినేత ఆరా తీశారని తెలుస్తోంది. కావాలంటే మరో పదవి ఇస్తామని ఆయన చెప్పారని తెలుస్తోంది.
జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణా రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను టిడిపి బుజ్జగిస్తోంది.చంద్రబాబు రెండు రోజుల క్రితం నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. చల్లాకు కడప ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. తనకు పదవి ఇవ్వకపోయినా బాధపడే వాడిని కాదని, కానీ చిన్న పదవి ఇచ్చి అవమానించారని భావిస్తున్నారు.తనకంటే జూనియర్ నేతలకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చి తనకు ఎగతాళి చేసినట్లు పదవి ఇచ్చారని వాపోతున్నారు.తాను కడప ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవి చేపట్టేది లేదని చల్లా రామకృష్ణా రెడ్డి తేల్చారు.