Arjun Kapoor Slams A Website For Its Derogatory Remarks on Janhvi Kapoor

2018-04-13 1,353

Arjun Kapoor slams a website for its derogatory remarks on Janhvi Kapoor. Recently Boney Kapoor went to Arjun Kapoor house


శ్రీదేవి మరణంతో షాక్ లోకి వెళ్లిన బోనికపూర్ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటకు వస్తోంది. శ్రీదేవి ఫిబ్రవరి 24 న దుబాయ్ లో అనూహ్య మరణం చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమనే విస్మయానికి గురిచేసింది. శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి తీవ్ర వేదనలోకి వెళ్లిపోయారు. జాన్వీ దఢక్ చిత్ర షూటింగ్ తో దుఃఖం నుంచి బయటకు వస్తోంది.
జాన్వీ, ఖుషి అప్పటివరకు వారు తల్లిచాటు బిడ్డలుగా పెరిగారు. శ్రీదేవి అనూహ్యంగా మృతి చెందడంతో కుమార్తెలు ఇద్దరూ దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ దుఃఖం నుంచి వారు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.
జాన్వీ కపూర్ దఢక్ చిత్రంతో బిజీగా మారి తల్లి మృతిచెందిన భాద నుంచి కొంత మేరకు బయట పడగలుగుతోంది.
శ్రీదేవి ఉన్నత వరకు బోని కుటుంబానికి అర్జున్ కపూర్ కు మధ్య మాటలు లేవు. అర్జున్ కపూర్ కనీసం తన తండ్రి బోనితో కూడా ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు వారి మధ్య బంధం బాగా బలపడింది.
తల్లిని కోల్పోయిన జాన్వీ, ఖుషిని అర్జున్ కపూర్ బాధ్యతగల అన్నగా చేరదీస్తున్నాడు. వారికీ అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తన్నాడు. అన్షులా కూడా వారికీ అండగా నిలుస్తోంది.
ఇటీవల బోనీ కపూర్ తన కుమార్తెలతో అర్జున్ కపూర్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో జాన్వీ వేసుకున్న డ్రెస్ ని హైలైట్ చేస్తూ ఓ వెబ్ సైట్ అసభ్యంగా ఫోటో చిత్రీకరించింది.
ఈ విషయం అర్జున్ కపూర్ దృష్టికి రావడంతో అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సదరు వెబ్ సైట్ ని బూతులు తిడుతూ తన ఆగ్రహం వ్యక్తం చేసాడు. మీరు చేసింది సిగ్గుమాలిన చర్య అంటూ బుద్ది చెప్పాడు. యువతీ పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ అర్జున్ కపూర్ ప్రశ్నించడం విశేషం.

Free Traffic Exchange