Sri Reddy reveals sensational writer name. Kona Venkat forced me says Sri Reddy
నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనని అవకాశాల పేరుతో వాడుకున్నారని శ్రీరెడ్డి సినీప్రముఖులు పేర్లు బయటకు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ గురించి సంచలన విషయాలు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో శ్రీరెడ్డి ప్రకంపనలు రేపుతోంది. కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి వెల్లడిస్తున్న అంశాలు విస్మయానికి గురిచేసే విధంగా ఉన్నాయి. అవకాశాల పేరుతో తనని ఎలా వాడుకున్నారు.. సినీఇండిస్ట్రిలో రాణించాలని వస్తున్న యువతుల బతుకులు ఎలా నాశనం అవుతున్నాయి అనే విషయాలని శ్రీరెడ్డి బయట పెడుతోంది.
హైదరాబాద్ లో స్మశానం వెనుక ఉన్న గెస్ట్ హౌస్ కు పిలిచాడు. అక్కడకు వివి వినాయక్ వస్తాడని, పరిచయం చేస్తానని నమ్మించి పిలిచాడు. మందు తాగుతావా అని అడిగాడు.. నాకు అలవాటు లేదు అని తాను చెప్పినట్లు శ్రీరెడ్డి తెలిపింది. ఆ తరువాత లైంగికంగా తనని బలవంతం చేసినట్లు శ్రీరెడ్డి ఆరోపించింది.
కోనవెంకట్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని శ్రీరెడ్డి తెలిపింది. పోలీస్ లు లాగితే అతడి చేసిన బెదిరింపు కాల్స్ బయట పడుతాయని శ్రీరెడ్డి తెలిపింది.
త్వరలోనే తాను మరో ఇద్దరి పేర్లు బయట పెడుతా అని శ్రీరెడ్డి షాక్ ఇచ్చింది. శ్రీరెడ్డి వలన ఇంకెంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో అని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై కోనవెంకట్ స్పందించారు. ఓ నటి తనతో పాటు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తోంది. దీనిపై పోలీస్ లు దర్యాప్తు జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోన వెంకట్ డిమాండ్ చేసారు.
చాలా మందికి సినీ ఇండస్ట్రీ, సినీ ప్రముఖులు టార్గెట్ గా మారుతున్నారని కోనవెంకట్ ఆరోపించారు. వారంతా చీప్ పబ్లిసిటి కోసమే ఇదంతా చేస్తున్నారని కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తెలుగు నటులు తెలుగు చిత్రాల్లో ఉండాలనే వాదనతో తాను ఏకీభవిస్తానని కోనవెంకట్ అన్నారు. తన గీతాంజలి చిత్రంలో కూడా ఎక్కువగా తెలుగు నటులే ఉన్నారని ఆయన అన్నారు.