Facebook chief Mark Zuckerberg took personal responsibility Tuesday for the leak of data on tens of millions of its users, while warning of an "arms race" against Russian disinformation during a high stakes face-to-face with US lawmakers.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున పనిచేసిన బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 8.7కోట్ల మంది వినియోగదారుల సమాచారం అక్రమంగా ఉపయోగించుకోగా, అందులో 5.62లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఫేస్‌బుక్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. వినియోగదారుల సమాచార ప్రైవసీ, భద్రతపై విఫలమవ్వడంపై అమెరికా సెనెటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
డేటా లీకేజీకి సంబంధించి జుకర్‌బర్గ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో జుకర్‌బర్గ్ పలుమార్లు క్షమాపణలు చెప్పారు. తప్పుడు వార్తలకు సమాచారం వాడకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యామని, యాప్ డెవలపర్ నుంచి కేంబ్రిడ్జి అనలిటికా సమాచారం పొందిందని తెలిపారు. డేటా దుర్వినియోగంపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వేల సంఖ్యలో నకిలీ ఖాతాలు తొలగించామని వివరించారు.
మరోసారి తమ వల్ల తప్పు జరగదని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి అమెరికా కాంగ్రెస్ ముందు హాజరయ్యారు. ఫేస్‌బుక్‌లో జరిగిన డేటా దుర్వినియోగానికి తానే బాధ్యత వహిస్తూ మరోసారి సెనేట్‌లో క్షమాపణలు కోరారు. సెనేట్‌కు చెందిన జ్యుడీషియరీ, కామర్స్ కమిటీల ఎదుట జుకర్‌బర్గ్ మాట్లాడారు. తప్పు తనదేనని మరోసారి అంగీకరించారు. 'ఫేస్‌బుక్ నేనే ప్రారంభించాను, నేనే నిర్వహిస్తున్నా, ఇక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత' అని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.