Sri Reddy Opens Up About Chatting With News Channel Ceo

2018-04-11 1,182

Sri Reddy opens up about chatting with news channel CEO. Sri Reddy gives clarity in it.


గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమని కుదిపేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంతాల గురించి శ్రీరెడ్డి కామెంట్లు కాక రేపుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలని శ్రీరెడ్డి మంగళవారం కొన్ని మీడియా సంస్థల వేదికగా విడుదల చేసింది.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో ఆమెకు పలువురు మహిళా సంఘాల నుంచి మద్దతు లభించింది.టాలీవుడ్ ప్రముఖులు అవకాశాలు ఇప్పిస్తామని ఎలా ఇబ్బంది పెడుతున్నారో వివరిస్తూ రెడ్డి ప్రముఖుల పేర్లు బయట పెడుతోంది.
తన పోరాటానికి ఇప్పటికే పలువురి నుంచి మద్దత్తు లభిస్తోందని, ఓయూ సంఘాల మద్దతు కూడా తీసుకుంటానని శ్రీరెడ్డి చెబుతోంది.
నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తనని అవకాశాల పేరుతో వాడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తాను విడుదల చేసినవి కేవలం సెల్ఫీలు మాత్రమే అని అతడు తనని బలవంతగా వాడుకునట్లు శ్రీరెడ్డి తాజగా ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ లో తెలిపింది.
తనతో ప్రముఖ ఛానల్ సీఈవోలు చాటింగ్ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని, సోషల్ మీడియాలో సర్క్యూలేటింగ్ అవుతున్న చాటింగ్ సంబందించిన దృశ్యాలు మార్ఫింగ్ చేయబడ్డాయి అని శ్రీరెడ్డి తెలిపింది.