One of India’s most popular sports anchor Mayanti Langer is winning the internet with her quirky reply to her fan who wanted to take her out for a dinner date. A Twitter user by the name of Fahad Khan complimented her and then asked her out in the sweetest way possible. He wrote, “ When I see you. I don’t mind watching IPL. You are a perfect blend of class & personality. I wish I was influential enough to take you dinner. I don’t have words to say how beautiful you are.” Well, Twitterati thought this was indeed the cutest way to approach your favourite sports presenter.
మయాంతి లాంగర్... స్పోర్ట్స్ గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్యగా కంటే కూడా స్పోర్ట్స్ యాంకర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. క్రికెట్‌కు సంబంధించి ప్రీ-మ్యాచ్, పోస్ట్-మ్యాచ్ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చిందంటే చాలు మయాంతి లాంగర్ కనిపించకుండా మ్యాచ్ జరగదంటే నమ్మండి. యాంకరింగ్ చేయడంలో దిట్ట. మయాంతి లాంగర్ యాంకరింగ్‌లో ఓ ప్రత్యేకమైన గ్రేస్, స్టైల్ ఉంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది.
ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్‌కు స్టార్ స్పోర్ట్స్ తరుపున మయాంతి లాంగర్ యాంకర్‌గా వ్యవహారిస్తున్నారు. అయితే, ఆమె యాంకరింగ్ నచ్చిందో లేక ఆమె నచ్చిందో తెలియదు గానీ... ఓ అభిమాని ఆమెను డిన్నర్ డేట్‌కు రమ్మని పిలిచాడు. ఆ అభిమాని కోరికను ఆమె కాదనలేదు.
అంతేకాదు, ఆ అభిమానికి ఆమె ఇచ్చిన సమాధానం ఆమెపై ప్రశంసలు కురిసేలా చేసింది. ఫహాద్ ఖాన్ అనే అభిమాని తన ట్విట్టర్ ద్వారా మయాంతి లాంగర్‌ను డిన్నర్ డేట్‌కు ఆహ్వానించాడు. తన ట్విట్టర్‌లో 'నేను మిమ్మల్ని చూసినప్పుడు.. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడం మానేశా. మీరొక అద్భుతమైన పర్సనాలిటీ. మిమ్మల్ని నేను డిన్నర్‌కు తీసుకెళ్తామని అనుకుంటున్నా. మీరు ఎంత అందంగా ఉన్నారో వర్ణించడానికి నా దగ్గర మాట్లలేవ్' అని ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత ఫహాద్ ఖాన్ ట్వీట్‌కు మయాంతి లాంగర్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించింది. మయాంతి లాంగర్ తన ట్విట్టర్‌లో 'థ్యాంక్ యూ! నా భర్తతో పాటు నేను ఇద్దరం కలిసి డిన్నర్ డేట్‌కు వస్తాం' అని ట్వీట్ ద్వారా బదులిచ్చింది.