IPL 2018 KKR vs CSK: Sam Billings Credits MS Dhoni, Suresh Raina For His 56 Run Knock

2018-04-11 50

Sam Billings who slammed 23 ball 56 credited MS Dhoni and Suresh Raina for his performance. In the post match presentation Billings said that he was thankful to have veterans like MS Dhoni, Suresh Raina in his team. You can catch live match of IPL every day from 4 pm and 8 pm on HotStar.

కోల్‌కతాతో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 23 బంతులలో 56 పరుగులు చేసిన అతను సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌కు అపూర్వ విజయం అందించాడు. దీంతో చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించి.. కోల్‌కతాపై ఐదు వికెట్లతో తేడాతో చెన్నై గెలుపొందింది. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నైలో ఆడుతున్న తొలి మ్యాచ్‌ కావడం.. ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడం సీఎస్కే జట్టులో కొత్త ఉత్సాహం నింపింది.
చెన్నైలోని లెజెండ్‌ ఆటగాళ్లతో ఆడటం ఎంతో సంతోషంగా ఉందని మ్యాచ్‌ అనంతరం సామ్‌ బిల్లింగ్స్‌ చెప్పాడు. తమ జట్టు మిడిలార్డర్‌లో ధోనీ, రైనా, జడ్డేజా వంటి బిగ్‌ హిట్లర్లు ఉన్నారని, ఎంతటి లక్ష్యమైనా తమ జట్టు ఛేదించగలదనే విషయం తమకు తెలుసునని ధీమా వ్యక్తం చేశాడు. ‘రైనా, ధోనీ, హర్భజన్‌ వంటి లెజెండ్స్‌తో ఆడటంతో ఎంతో సంతోషంగా ఉంది. కోచ్‌గా మైక్‌ హస్సీ కూడా ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొన్ని ఆప్షన్స్‌తో మేం మైదానంలోకి దిగాం. మూడు భిన్నమైన ప్రణాళికలు వేశాం. మొదట వచ్చిన బ్రేవో అందులో భాగంగానే ఆడాడు. రైనా, ధోనీ, జడ్డేజా వంటి బిగ్‌ హిట్టర్లు మిడిల్‌ ఆర్డర్‌లో ఉన్నారు. ఈ బ్యాటింగ్‌ టీమ్‌కు ఎంతటి లక్ష్యమైనా ఛేదించడం కష్టం కాదు’ అని బిల్లింగ్స్‌ చెప్పాడు.