ప్రత్యేక హోదా కోసం తాము నిలదీస్తం కానీ కాళ్లు మొక్కం : లోకేష్

2018-04-11 9

“Vote for anybody but the BJP” the Telugu Desam is telling Telugus who will be voting in the Karnataka assembly elections.

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీపీ మరో అడుగు ముందుకు వేసి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెబుతోంది.
బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పడం ద్వారా టీడీపీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పిలుపునిచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంది. ఇక, టీడీపీ-వైసీపీలు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నానని, ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పండని, ఏపీ ప్రజలు దేనికీ నోచుకోలేదని వైయస్ విజయమ్మ అన్నారు.సోమవారం ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్షా ప్రాంగణంలో వైయస్ విజయమ్మ వ్యాఖ్యలకు టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము నిలదీస్తామని, కానీ కాళ్లు మొక్కమని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పోరాడుతామన్నారు. మోడీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం పెడితే, మద్దతివ్వాలని కోరితే విపక్షాలన్నీ అండగా నిలబడ్డాయన్నారు. ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
ముగ్గురు ఎంపీలు ఆసుపత్రిలో చేరితే మూడు వికెట్లు పడ్డాయని, ఇంకో రెండు వికెట్లు పడితే వెళ్లి బీజేపీతో రాజీ పడతారని టీడీపీ ఎంపీలు అనడం సరికాదని విజయమమ్మ చెప్పారు. భేషజాలకు పోకుండా 25 మంది ఎంపీలు రాజీనామా చేసి హోదా సాధించుకుందామన్నారు.
కర్నాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మాత్రం లోకేష్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలోని తెలుగువారంతా బీజేపీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చేందుకు ఆయనెవరని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు.

Videos similaires