IPL 2018: Chennai Super Kings vs Kolkata Knight Riders Preview

2018-04-10 46

Chennai Super Kings will take confidence from their thrilling one-wicket victory against defending champions Mumbai Indians when they take on Kolkata Knight Riders in an Indian Premier League match.

ఇప్పటికే తొలి విజయాన్ని నమోదు చేసుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ అదే ఫలితాన్ని కొనసాగించాలని భావిస్తోంది. చెపాక్ స్టేడియం వేదికగా రెండో మ్యాచ్‌కు చెన్నై జట్టు సిద్ధమైంది. రెండేళ్ల తర్వాత రెండో మ్యాచ్ ఆడుతున్న చెన్నై జట్టు సొంత గడ్డపై ఆడుతుండటంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అంతే స్థాయిలో కావేరి జలాల వివాదమూ జట్టుకు తప్పలేదు.
ఐపీఎల్‌లో విజయంతో పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ ఇప్పుడు సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరుకు సిద్ధమైంది. రెండేండ్ల నిషేధం కారణంగా మే 2015 తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ చెపాక్ స్టేడియంలో ఆడనుండడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌ను ధోనీ సేన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది.
ఆల్‌రౌండర్ బ్రావో సూపర్ ఫామ్‌లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో విఫలమైన రైనా ఈసారి భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాడు. కాగా గాయం కారణంగా కేదార్ జాదవ్ ఐపీఎల్‌కే దూరమవడం ఆ జట్టుకు కొంత లోటని చెప్పొచ్చు. ఇతడి స్థానంలో మురళీ విజయ్‌కు అవకాశం ఇవ్వనున్నారు.
అదే జరిగితే రాయుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి వెళుతాడు. పేస్ బౌలర్ మార్క్‌వుడ్‌కు బదులు శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలని భావిస్తే..ఫారిన్ కోటాలో స్యామ్ బిల్లింగ్స్‌ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నది. స్పిన్ విషయానికొస్తే హర్భజన్, ఇమ్రాన్ తాహీర్, జడేజాల త్రయం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 5 ఓవర్లే వేసింది. అయితే స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించడం ఖాయం.
మరోవైపు దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా తొలి మ్యాచ్‌లోనే బలమైన బెంగళూరుకు షాకిచ్చి ఊపుమీద ఉన్నది. అదే జోరును కొనసాగిస్తూ చెన్నైకి చెక్ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నది.
కోల్‌కతా కెప్టెన్, లోకల్ బాయ్ దినేశ్ కార్తీక్ సొంత అభిమానుల మధ్య మరింత రెచ్చిపోయి ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత మ్యాచ్‌లో ఇరుగదీసిన సునీల్ నరైన్ మరోసారి ధనాధన్ అనిపించాలని చూస్తుండగా..క్రిస్ లిన్, ఊతప్ప, నితీశ్ రాణా బ్యాటింగ్ భారాన్నీ మోయనున్నారు. జాన్సన్, వినయ్‌తో పేస్ ఎటాక్ పటిష్ఠంగా ఉండగా స్పిన్ విభాగంలో కుల్దీప్, నరైన్, చావ్లా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.