Rangasthalam Crossed Rs 150 Crore Mark

2018-04-10 6

Ram Charan's Rangasthalam crossed Rs 150 crore mark at the worldwide box office in 11 days and it has become the fourth all-time highest grossing Telugu film.

సూపర్ డూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుని వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తున్న 'రంగస్థలం' మూవీ తాజాగా రూ. 150 కోట్ల(గ్రాస్) మార్కును అధిగమించింది. తెలుగు సినిమా చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది. కేవలం 11 రోజుల్లోనే ఈ చిత్రం ఈ ఘనత సాధించడం విశేషం.
ఇప్పటి వరకు తన గత సినిమా ‘మగధీర' పేరు మీద ఉన్న 150 కోట్ల గ్రాస్ రికార్డును ‘రంగస్థలం' సినిమా ద్వారా అధిగమించాడు రామ్ చరణ్. ఇప్పటి వరకు రంగస్థలం 11 రోజుల్లో రూ. 151.29 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
‘రంగస్థలం' కంటే ముందు బాహుబలి-ది కంక్లూజన్(1706 కోట్ల గ్రాస్), బాహుబలి-ది బిగినింగ్(600 కోట్ల గ్రాస్), ఖైదీ నెం.150 (164 కోట్ల గ్రాస్) చిత్రాలు ఉన్నాయి. మొదటి రెండు చిత్రాలను అందుకోవడం అసాధ్యమే కానీ.... తన తండ్రి 150వ చిత్రం వసూళ్లను రామ్ చరణ్ త్వరలోనే అధిగమించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
రూ. 60 కోట్ల బడ్జెట్‌తో రంగస్థలం తెరకెక్కింది. రూ. 80 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. 11 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 95 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది. దీంతో ఈ సినిమాను కొనుగోలు చేసిన ప్రతి బయ్యర్ లాభాల్లోకి వెళ్లినట్లయింది. వారంతా తమ పెట్టుబడి 100 శాతం రికవరీ చేసుకోవడంతో పాటు దాదాపు 18శాతం లాభాలు జేబులో వేసుకున్నారు.
తొలి 10 రోజులకు సంబంధించి ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ డీటేల్స్ ఇలా ఉన్నాయి
నైజాం: 19.91 కోట్లు సీడెడ్: 13.10 కోట్లు నెల్లూరు: 2.46 కోట్లు గుంటూరు: 6.76 కోట్లు కృష్ణ: 5.40 కోట్లు వెస్ట్ : 4.60 కోట్లు ఈస్ట్: 5.87 కోట్లు ఉత్తరాంధ్ర: 9.53 కోట్లు టోటైల్ ఏపీ-నైజాం షేర్: రూ. 67.63 కోట్లు కర్నాటక: రూ. 7.62 కోట్లు రెస్టాఫ్ ఇండియా: రూ. 2.50 కోట్లు ఓవర్సీస్: రూ. 15.60 కోట్లు వరల్డ్ వైడ్ టోటల్ షేర్: రూ. 93.35 కోట్లు