IPL 2018: Sunrises Hyderabad Beat Rajasthan By 9 Wickets In Low Scoring Match

2018-04-10 26

Opener Shikhar Dhawan and skipper Kane Williamson made light work of the chase to give Sunrisers Hyderabad a thumping 9-wicket win over Rajasthan Royals in their opening game of the Indian Premier League Dhawan (77* off 57 balls) made a statement of intent as he began his campaign in IPL 2018 on a positive note and smashed an unbeaten half-century.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. శిఖర్‌ ధావన్‌(77 నాటౌట్‌; 13ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించగా, కేన్‌ విలియ‍మ్సన్‌(36 నాటౌట్‌; 3ఫోర్లు,1సిక్స్‌) సమయోచితంగా ఆడటంతో సన్‌రైజర్స్‌ సునాయాసంగా విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది.
రాజస్థాన్ తరఫున సంజూ శాంసన్ (49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులు విసరడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడలేకపోయారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆటగాళ్లు అందరూ కలిసి 12 ఫోర్లు మాత్రమే బాదగలిగారు.
దీంతో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్‌లో సిక్స్‌లు లేకుండా ఓ జట్టు ఇన్నింగ్స్ ముగించడం ఇది 11వ సారి కాగా, రాజస్థాన్ రాయల్స్‌కు నాలుగోసారి. ఐపీఎల్‌లో సిక్స్‌లు లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.