రాష్ట్రంలోని కొన్ని పార్టీలు కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు : బాబు

2018-04-09 140

Tdp decided to conduct cycle rallies in every assembly segment in the state. Tdp strategy committee meeting held at Amaravathi on Monday.

టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా విషయమై చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయన పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు.ప్రత్యేక హోదా విషయమై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ఈ విషయమై తామే ఛాంపియన్‌గా నిలిచేందుకు అవసరమైన వ్యూహన్ని రచించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.మరో వైపు పార్టీ అధికార ప్రతినిధులతో టిడిపి వ్యూహ కమిటీ మంగళవారం నాడు అమరావతిలో సమావేశం కానుంది.
కేంద్రం ఏ రకంగా తమను ఇబ్బందులకు గురిచేసిందనే విషయాలను ప్రజలకు వివరిస్తూ బస్సు యాత్ర సాగనుంది.ఆత్మగౌరవ యాత్ర పేరుతో ఈ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. మూడు రోజుల్లోపుగానే బస్సు యాత్ర ప్రారంభించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.
జిల్లాల్లో కూడ హోదా పోరులో భాగంగా మేధావులు, వివిధ సంఘాలతో జిల్లాల వారీగా అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదాపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.అంతేకాదు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై కూడ చర్చించనున్నారు. మరోవైపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ సైకిల్ ర్యాలీలు చేపట్టాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.
రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని టిడిపి వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి అర్హులైన వారందరికీ ఈ భృతిని అమలు చేయనున్నారు.అయితే ఈ హమీని అమలు చేసే ప్రక్రియలో ఆలస్యం జరిగింది. దీంతో వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని వ్యూహకమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ఈ పథకానికి తోడుగా అన్న క్యాంటీన్లను కూడ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Videos similaires