IPL 2018 : KL Rahul smashes fastest IPL fifty as KXIP crush DD by 6 wickets

2018-04-09 172

After Rahul's dismissal in the powerplay, his Karnataka teammate Karun Nair ensured the team doesn't lose momentum and kept the scored board ticking. Nair slammed a breezy half-century and never let his side get off course in the run chase. Nair smashed 50 off 33 (5X4, 2X6) before he was dismissed by Daniel Christian while trying to hit him over the fence.


కొత్త కెప్టెన్‌ అశ్విన్‌ సారథ్యంలో సొంతగడ్డపై కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ శుభారంభం చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (16 బంతుల్లో 51; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ను 6 వికెట్లతో ఓడించింది. కీలక సమయంలో కరుణ్‌ నాయర్‌ (33 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్‌ ఝళిపించడంతో ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని మరో 7 బంతులు ఉండగానే అందుకుంది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.కెప్టెన్‌ గంభీర్‌ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం సాధించాడు. పంజాబ్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ (2/33), ముజిబుర్‌ రహమాన్‌ (2/28) రాణించగా, అశ్విన్‌ (1/23) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. రాహుల్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
ప్రత్యర్థి జట్టులో బౌల్ట్, షమీ, అమిత్‌ మిశ్రా వంటి బౌలర్లు ఉన్నా రాహుల్‌ ఎదుట అంతా తేలిపోయారు.బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌లోనే అతడు 16 పరుగులు బాదేశాడు.2వ (షమీ) ఓవర్లో 11, 3వ (మిశ్రా) ఓవర్లో 24 పరుగులతో 14 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు.ఈ క్రమంలో యూసుఫ్‌ పఠాన్‌ (15 బంతుల్లో 2015 సన్‌రైజర్స్‌పై) పేరిట ఉన్న ఐపీఎల్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డును రాహుల్‌ బద్దలు కొట్టాడు. మూడు ఓవర్ల అనంతరం పంజాబ్‌ స్కోరు 52 కాగా...అందులో రాహుల్‌వే 51 పరుగులు కావడం తానెంతగా వీర విహారం చేశాడో చెబుతోంది.
ఈ జోరు చూస్తే పంజాబ్‌ 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేస్తుందా? అనిపించింది. అయితే రాహు ల్‌తో పాటు మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (7)ను వరుస ఓవర్లలోఅవుట్‌ చేసి ఢిల్లీ బౌలర్లు పరువు దక్కించుకున్నారు. వన్‌డౌన్‌లో వచ్చిన యువరాజ్‌ సింగ్‌(12) తడబడుతున్నా... కరుణ్‌ నాయర్‌ స్వేచ్ఛగా ఆడటంతో పంజాబ్‌ ఎక్కడా ఇబ్బంది పడలేదు.లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నాయర్‌ అవుటైనా.. మిల్లర్‌ (24 నాటౌట్‌), స్టొయినిస్‌ (22 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు.