Pawan Kalyan Son Akira Birthday Pic Goes Viral

2018-04-09 2,067

Ram Charan wishes Pawan Kalyan son Akira on his birthday. Mega pic goes viral in social media

మెగా కుటంబం మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు, పవన్ మధ్య రాజకీయాల వలన విభేదాలు వచ్చాయని ఆ మధ్యన చర్చ జరిగింది. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ పవన్, చిరంజీవి ఇద్దరూ ప్రేమానురాగాలతో ఉంటున్నారు. సంధర్భం వచ్చినప్పుడల్లా పవన్, చిరు కుటుంబసభ్యులు కలుసుకుంటూనే ఉన్నారు.
ఇటీవల జరిగిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. పవన్, చిరు కుటుంబాలు ఒకరిపై ఒకరికి పత్యేకమైన ఆప్యాయత అనురాగాలు పంచుకుంటుంటారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా, కుమార్తె ఆద్యతో కలసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషం. మెగా అభిమానులు ఈ పిక్ చూసి పండగ చేసుకుంటున్నారు.
ఆదివారం అకిరా పుట్టినరోజు. ఈ సందర్భంగా రాంచరణ్.. అకిరా, ఆద్యతో కలసి ఉన్న పిక్ ని షేర్ చేసి అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు. రాంచరణ్ షేర్ చేయడంతో ఈ [ఫోటో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన ఈ పిక్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు ఆశ్చర్య పోతున్నారు కూడా. 14 ఏళ్ల వయసులోనే అకిరా హైట్ చూసి మురిసిపోతున్నారు. పొడవుతో అప్పుడే పవన్, రాంచరణ్ ని దాటేశాడని కామెంట్లు పెడుతున్నారు.

Free Traffic Exchange