IPL 2018 : KL Rahul Smashes Fastest IPL Fifty As KXIP Crush DD By 6 Wickets

2018-04-09 34

Coming out to chase a decent target of 167, Rahul looked in ominous form as he smacked Delhi bowlers from the word go. Hitting at an incredible strike rate of 319, Rahul plundered Delhi bowlers all over. His 16-ball innings was laced with six fours and four sixes before he was dismissed on a full toss by Trent Boult in the fourth over.

పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ 18.5 ఓవర్లలో ఛేదించింది. కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(51), వేగవంతమైన ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీకి జతగా కరుణ్‌ నాయర్‌(50) అర్థ శతకం సాధించి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు 20ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడువికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్‌ గౌతం గంభీర్‌(55) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, రిషబ్‌ పంత్‌(28), క్రిస్‌ మోరిస్‌(27) నాటౌట్‌లు మోస‍్తరుగా స్కోరు చేశారు.
కొలిన్ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై శ్రేయస్‌ అయ్యర్‌(11), విజయ్‌ శంకర్‌(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్‌ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ.
కాగా, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్‌(55) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు రిషబ్‌ పంత్‌(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మోరిస్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ తలో రెండు వికెట్లు సాధించగా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌కు చెరో వికెట్‌ దక్కింది.