టాలీవడ్ లో శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు సంచలనంగా మారుతోంది. టాలీవడ్ జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ ఉందంతాల గురించి శ్రీరెడ్డి కొన్ని రోజులుగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను ఇండస్ట్రీలో అవకాశాలు పేరుతో మోసపోయిన విధానం, ఇండస్ట్రీ ప్రముఖులు వర్తమాన హీరోయిన్లని ఎలా వాడుకుంటున్నారో అనే సంచలన అంశాలని శ్రీరెడ్డి బయట పెడుతూ వచ్చింది. ఇంత జరుగుతున్నా తెలుగు హీరోయిన్లకు మాత్రం అవకాశాలు ఇవ్వరని ఆరోపిస్తోంది. దీనిపై పోరాటం చేస్తానని ప్రకటించిన శ్రీరెడ్డి అవసరమైన నగ్నంగా నిలబడి అయినా తన నిరసన తెలియజేస్తానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంచలన నటి నేను అన్నంత పని చేసింది.