with less than a week left for the indian premier league to begin, some political groups in Tamil Nadu have demanded that no match should take place in chennai for the Cauvery Management Board has not yet been set up.
చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగేది డౌట్‌గానే కనిపిస్తోంది. కావేరీ జలాల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని, వెంటనే కావేరి మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలనే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి.
ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలని అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొన్నాయి. తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే) పార్టీ నేతలు ఏకంగా చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిలిపివేయాలని ఆ నగర పోలీస్ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ నేఫథ్యంలో ఈ సీజన్ మ్యాచ్‌లు జరిగే దానిపై అనుమానాలు నెలకొనడం అభిమానులను కలవర పెడుతోంది. టోర్నీలో భాగంగా చెన్నై జట్టు తన తొలి మ్యాచ్‌ని డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టుని హాట్ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ధోని నాయకత్వంలోని చెన్నై 2010, 2011లో రెండుసార్లు టైటిల్ సాధించింది.
రెండేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన చెన్నై అభిమానులు ఈ ఏడాది 11వ సీజన్ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 10న చెన్నై నగరంలో చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరుగనున్న తొలి మ్యాచ్ టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను తట్టుకోలేకపోతున్నారు.