why Allu Arjun has not watched Charan's Rangasthalam yet. Cause revealed.
రంగస్థలం చిత్రం విడుదలైన దుమ్ములేపుతోంది. రాంచరణ్ కెరీర్ లోనే నటన పరంగా, కలెక్షన్ల పరంగా ది బెస్ట్ మూవీగా రంగస్థలం చిత్రం నిలిచింది. రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి మరియు సుకుమార్ సహా చిత్రం యూనిట్ మొత్తం సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు దాదాపుగా ఈ చిత్రాన్ని చూసి రాంచరణ్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
రంగస్థలం చిత్రం విడుదలై ఐదురోజులు గడుస్తున్నా ఇప్పటికి ఆ చిత్ర హవా బాక్స్ ఆఫీస్ ముందు కొనసాగుతూనే ఉంది. అంతలా సుకుమార్, రాంచరణ్ తో కలసి మ్యాజిక్ చేసాడు. 1980 నాటి పరిస్థితులని నేటి తరం ముందు ఆవిష్కరించాడు.
బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం రాంచరణ్ రంగస్థలం చిత్ర స్పెషల్ షో ని ప్రదర్శించాడు. రంగస్థలం చిత్రం చూసిన పవన్ చరణ్, సుకుమార్ కు అభినందనలు తెలిపాడు.
మెగా కుటుంబంలో మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ ఇంకా రంగస్థలం చిత్రం చూడకపోవడంతో అభిమానుల్లో చర్చ జరుగుతోంది. బన్నీ రంగస్థలం చూడకపోవడానికి కారణం ఏంటని చర్చ సినీవర్గాల్లో కూడా జోరుగా సాగుతోంది. ఈ వార్తల ప్రకారం మెగా అభిమానులు చర్చించుకోవాల్సినంత విషయం లేదని అంటున్నారు.
ఇటీవలే బన్నీ తన తనయుడు అయాన్ 4 వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. దీనితో కొడుకు కోసం సమయాన్ని కేటాయిస్తూ బన్నీ బిజీగా గడిపాడు. ఆ తరువాత రంగస్థలం చిత్రం చూద్దామని భావించినా తన తల్లి నిర్మల కోరిక మేరకు ఆగాడట. ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసే బదులు అభిమానుల మధ్య థియేటర్ కు వెళ్లి ఫ్యామిలీ మొత్తం చిత్రాన్ని చూద్దాం అని ఆమె బన్నీని కోరారట. తల్లి కోరికకు బన్నీ ఒకే చెప్పాడని సరైన సమయంలో రంగస్థలం చిత్రం చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.